మనకు లభించే పండ్లలో అరటి పండు ఒకటి. ఈ అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇందులో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి.
అయితే అరటి పండు తినడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి.
అరటి పండు తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, అవి అతిగా తినేటప్పుడు మాత్రమే వస్తాయి.
అధిక పొటాషియం:-
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, కానీ అవి కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అధిక పొటాషియం తీసుకోవడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరగవచ్చు, ఇది ప్రమాదకరమైనది.
అధిక చక్కెర:-
అరటి పండ్లలో చక్కెర సహజంగా ఉంటుంది, అయితే మధుమేహం ఉన్నవారు వాటిని పరిమితంగా తినాలి. అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
జీర్ణ సమస్యలు:-
కొంతమందిలో అరటి పండ్లు , ఉబ్బరం లేదా నీళ్ల విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఇది ఫైబర్ లేదా ఫ్రక్టోజ్ అసహనం కారణంగా ఉండవచ్చు.
బరువు పెరుగుట:-
అరటి పండ్లు కేలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే అరటిపండును పరిమితంగా తినాలి.