telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కలబందతో చర్మ, జుట్టు సమస్యలు మాయం… ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Aloe vera

కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. చాలామంది ఇప్పుడు కలబందను ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతాయి. దీనిని కాస్మోటిక్స్ లోను, ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడుతున్నారు. దీనితో లోషన్లు, యోగర్ట్స్‌ క్రీంలు, పానకాలు తయారు చేస్తున్నారు. జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
* కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి.
*శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.

Aloe vera
* ఉదయాన్నే పరగడుపున కల బంద ఆకుని తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది.
* కలబంద ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ వుంటే నల్ల మచ్చలుగానీ, మూలల్లో ఏర్పడిన నలుపుగానీ వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది.
* కలబంద నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. పిప్పిపళ్లకు, దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించటంలో కలబంద కీలకంగా పనిచేస్తుంది. సున్నితమైన దంతాలు ఉన్నవారు కలబంద జెల్‌తో తయారైన పేస్టులతో పళ్లు తోముకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
* కలబంద గుజ్జు మధుమేహం, కీళ్లనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. కలబందలో అలోయిన్ అనే రసాయనిక పదార్థం ఉంది.
* కలబంద నూనె వల్ల జుట్టు రాలటం, వెండ్రుకలు తెల్లబడటం, ఎఱ్ఱబడటం, చుండ్రు, ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికి రావు.
* కలబందని ఒక టేబుల్ స్పాన్ నిమ్మ రసం తో కలిపి ముఖం మీద ఎక్కడైతే తెల్ల మరియు నల్ల మచ్చలు ఏర్పడ్డాయో అక్కడ అప్లై చేయడం వలన మంచి ఫలితాలు . ఇలా చేయడం ముఖం మీద ఏర్పడిన రంద్రాలు,మొటిమలు, తెల్ల మరియు నల్ల మచ్చలను తొలగిస్తుంది.
* కలబంద గుజ్జును చెక్కెరతో కలిపి సేవించడము గాని, రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
* కలబంద రసం, పాలు, నీళ్ళతో కలిపి సేవిస్తే, సెగ రోగం, గనేరియా మెహ వ్యాధులు ఉపశామిస్తాయి.
* కలబంద గుజ్జును ఉడికించి వాపులు, గడ్డల పై కడితే తగ్గి పోతాయి.

Aloe vera
* కలబంద రసం లేదా వేరును పసుపుతో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గి పోతుంది.
* కలబంద రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే లివర్, స్ప్లీన్ వ్యాధులు ఉపశామిస్తాయి.
* కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి.
* రోజు ఉదయం, సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను తింటూ ఉంటే మలబద్దకము తగ్గిపోతుంది.
* కఫ వ్యాధులు ఉంటే కలబంద రసాన్ని పసుపులో కలిపి ఎదురురొమ్ముపై రుద్దిన ఉపశమనం కలుగుతుంది.
* పంటి నొప్పి, పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుల్లపై రుద్ధటము గాని, కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.
* దగ్గు నివారణకై 1 స్పూన్, మిరియాలు 1/4 స్పూన్, శొంటి 1/4 స్పూన్, తేనెలో కలిపి సేవించాలి.
* కడుపు నొప్పి లోను, కడుపులో గ్యాస్ ఏర్పడినపుడు, గోధుమ పిండి, కలబంద గుజ్జు పై వాము, సైంధవ లవణము, జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని భుజించాలి.
* అర్శమొలలు ఉంటే 10 నుండి 30 గ్రాముల కలబంద రసం తాగిస్తూ, కలబంద గుజ్జు పసుపు కలిపి అర్శమొలల పై లేపనము చేయాలి.
* కండ్ల కలక ఉన్నవారికి కలబంద ఆకు గుజ్జు కండ్లపై వేసి కట్టాలి.
* ఎండాకాలము వడదెబ్బలో కలబంద రససేవనం గ్లుకోజ్ లా పనిచేస్తుంది.

Related posts