ఐపీఎల్ 2018లో బీసీసీఐ తొలిసారిగా మిడ్-సీజన్ ట్రాన్స్ఫర్ విండోను ప్రవేశపెట్టింది. ఒక్కో జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఈ బదిలీ నిబంధనలు అమల్లోకి వస్తుంది. ఐపీఎల్ 2021 కోసం ఏప్రిల్ 26 రాత్రి 9 గంటలకు ఈ బదిలీలకు బీసీసీఐ విండోను ఓపెన్ చేసింది. మే 23 వరకు ఫ్రాంచైజీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓ ఆటగాడిని బదిలీ చేసినా.. సీజన్ ముగిసే వరకు అతడు సొంత ఫ్రాంచైజీ సభ్యుడిగానే ఉంటాడు. ఇతర ఫ్రాంచైజీకి వెళ్లిన తర్వాత ఆ ప్లేయర్ తన సొంత ఫ్రాంచైజీతో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండాలి. సొంత జట్టుపై మ్యాచ్ ఆడటానికి అతడికి అర్హత ఉండదు. సదరు ఆటగాడికి ఆ సీజన్‌కు సంబంధించిన పూర్తి జీతం తన సొంత ఫ్రాంచైజీనే చెల్లించాలి. అయితే తనను అప్పుగా తీసుకున్న ఫ్రాంచైజీ మాత్రం మ్యాచ్‌కు కొంత ఫీజు చెల్లిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీ ఈ సీజన్ ప్రారంభానికి ముందే రాబిన్ ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్‌కు అమ్మేసింది. ఇప్పుడు రాయల్స్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ఊతప్పను తిరిగి తీసుకోవాలి చూస్తోంది. ఇక జోఫ్రా ఆర్చర్, లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్ జట్టుకు దూరం అవడంతో జేసన్ రాయ్‌ని అప్పుగా తెచ్చుకోవాలని భావిస్తోంది. జేసన్ రాయ్ ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. హైదరాబాద్ విదేశీ ప్లేయర్ల స్లాట్స్ కూడా నిండుగా ఉన్నాయి. దీంతో అతడిని తీసుకోవాలని భావిస్తున్నది. ఇషాన్ పోరెల్‌పై కూడా రాయల్స్ కన్నేసింది.
previous post
next post


ఎన్నికల్లో పోత్తులపై పవన్ తో చర్చలు: కేఏ పాల్