telugu navyamedia
pm modi నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

ఫ్రాన్స్, అమెరికా విదేశీ పర్యటన కు ప్రధాన మోదీ

ప్రధాన మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

“రాబోయే కొద్ది రోజులలో, నేను వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఫ్రాన్స్ మరియు USA లో ఉంటాను.
ఫ్రాన్స్‌లో, నేను భారతదేశం కో-ఛైర్‌గా ఉన్న AI యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొంటాను. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో చర్చలు జరుపుతాను.

భారత్-ఫ్రాన్స్ సంబంధాలను బలోపేతం చేసే దిశగా. మేము అక్కడ కాన్సులేట్‌ను ప్రారంభించేందుకు మార్సెయిల్‌కి కూడా వెళ్తాము” అని ట్వీట్ చేసారు.

Related posts