telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా ఎఫెక్ట్ : రబ్బరు బంతిలో నడుచుకుంటూ షాపింగ్‌కు వెళ్లిన మహిళ

karona

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని మాస్క్ లతో, గ్లౌజులతో సిద్ధమవుతున్నారు ప్రజలు. లండన్ లోని ఓ మహిళ దీని కోసం వినూత్న ప్రయత్నం చేసింది. జోర్బ్ బాల్లో నడుచుకుంటూ షాపింగ్ కు వెళ్లింది. నిత్యవసర వస్తువులు కొనుక్కునేందుకు హెర్నె బే అనే మహిళ ఈ ఫీట్ చేసిందని స్థానికులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షాపింగ్ మాల్ లోకి ఎంటరవగానే ఇతర కస్టమర్లు ఆమెకు సైడ్ ఇస్తూ సహకరించారు. ఆమె స్టోర్ లోకి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తన వెంటే ఉండి కావలసినవన్నీ సమకూర్చి జాగ్రత్తలు తీసుకున్నాడు. షెల్ఫ్ లలో ఉన్న వస్తువులు తీసుకుంటూ ఉండగా ఆ వ్యక్తి పదేపదే ఆ బంతిని తుడుస్తూ ఆమెతో సంభాషణ జరుపుతూ కనిపించాడు. ఆ వ్యక్తిని మహిళ గురించి అడగ్గా ఆమెకు జెర్మాఫోబియా ఉందని, సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉందని చెబుతున్నాడు. ఇతర కస్టమర్లు రబ్బరు బంతితో ఆమె షాపింగ్ కు రావడంతో ఆమెను చూసి నవ్వుకుంటున్నారు. ఆమె కోసం ఇద్దరు ఎస్కార్ట్ లు కూడా వచ్చారని తెలిపారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లలో వైరల్ అయిపోయింది.

 

View this post on Instagram

 

#selfisolation #coronavirus #quarantine

A post shared by #DiscoBoy / Lee Marshall (@discoboyuk) on

Related posts