మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావు రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్దికి వినూత్న పథకాలు చేర్చామని అన్నారు. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి వినూత్న పథకాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్దరణకు ఇండస్ర్టియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటుచేశామని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇండియన్ స్కూల్ ఆఫ్‌బిజినెస్ (ఐఎస్‌బి) సౌజన్యంతో ఏర్పాటు చేసిన మూడు నెలల నైపుణ్య శిక్షణ శిబిరాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇండస్ర్టియల్ హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇండస్ర్టియల్‌పార్కుల ఏర్పాటుకు అదిక కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పదిహేడు మంది గిరిజన లబ్యిఽదారులకు సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూవర్‌షిప్ ఇన్నోవేషన్ పథకం కింద 7కోట్ల విలువైన యూనిట్‌ల ఏర్పాటు, మంజూరు పత్రాలు అందజేశారు.
అదే విధంగా రాష్ట్రంలో వివిధ ఇండస్ర్టియల్ పార్కులతో పరిశ్రమల స్ధాపనకు గిరిజన ఔత్సాహిక వేత్తలకు అవకాశం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అంతే కాకుండా వినూత్న పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నార. గిరిజన విద్యావంతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడానికి గిరిజన సంక్షేమశాఖ ఐఎస్‌బి, బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఇన్నోవేటివ్‌పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. ఈసందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ఈపథకం ద్వారా తాము పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే కోరిక నెరవేరిందని అన్నారు. ఈపధకం రూపకల్పన చేసి, అమలు చేస్తున్న గిరిజన సంక్షేమశాఖకు, ముఖ్యమంత్రి కేసీఆర్ వారుదన్యవాదాలు తెలిపారు.

