telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

అమెరికాలో 90 మంది భార‌తీయ విద్యార్థులు అరెస్టు!

ARREST crime

అమెరికాలో 90 మంది భార‌తీయ విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఫార్మింగ్‌ టన్‌ నకిలీ యూనివర్శిటీలో  విద్యార్థులు చేరడంతో అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డెట్రాయిట్ లోని ఫార్మింగ్‌ టన్ ఫేక్‌ యూనివర్శిటీని మూసివేసిన హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అందులో చేరిన 250 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్‌ అయిన వారిలో 90మంది భారతీయ విద్యార్థులున్నారని తేలింది. స్డూడెంట్స్‌ అరెస్ట్‌ తో పేరెంట్స్‌ ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే అమెరికాలో నాణ్యమైన విద్య పొందాలనే కలతో యూనివర్శిటీలో చేరిన విద్యార్థులను అరెస్టు చేయడం క్రూరమైన చర్యగా డెమోక్రటిక్ నేతలు అభివర్ణిస్తున్నారు.

Related posts