telugu navyamedia
రాజకీయ

ఉక్రెయిన్‌లో భారత విద్యార్ధి మృతి..

ఉక్రెయిన్‌పై ర‌ష్యా బాంబుల దాడులు కొన‌సాగుతూనే ఉంది.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్ధులు ప‌రిస్థితి ద‌యనియాంగా మారింది.

ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో రష్యా జరిపిన కాల్పుల్లో భారత విద్యార్ధి నవీన్ మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నవీన్ తన అపార్ట్మెంట్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళుతుండగా దురదృష్టవశాత్తు క్షిపణి దాడిలో మరణించాడని పేర్కొన్నారు. కర్నాటకకు చెందిన నవీన్ ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.

Related posts