పాపులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12లో ఎన్నో ఆశలతో ఫైనల్ పోరుకు చేరిన తెలుగు తేజం షణ్ముఖ ప్రియకు నిరాశే తప్పలేదు. 12 గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ ఫైనల్ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ తెరదింపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఫైనల్ షో అర్ధరాత్రి వరకు సాగింది. మొదటి నుంచి అద్భుత గానంతో అలరించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. షణ్ముఖ ప్రియతో సహా ఫైనల్ బరిలో పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్ , నిహల్, సేలీ కంబ్లే, మహ్మద్ దనిష్ నిలిచారు.
అయితే తన గానమాధుర్యంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్ విజేత పవన్‌దీప్ ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా ట్రోఫీ ని అందుకున్నారు. పవన్‌దీప్ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు. ఈ షో లో ఐదుగురు కంటెస్టెంట్లను ఓడించి పవన్ దీప్ రాజన్ విజేతగా నిలిచాడు. అరుణిత కంజిలాల్ రన్నరప్‌గా ఉండగా తెలుగమ్మాయి మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరోస్థానంలో నిలిచింది. మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్ దనిష్, ఐదో స్థానంలో నిహల్ ఉన్నాడు.

ఫైనల్ విజేతగా పవన్‌దీప్‌ను ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అనంతరం పవన్‌దీప్ మాట్లాడుతూ.. ‘‘నేను టైటిల్ గెలిచానని నమ్మలేకపోతున్నాను. కలలగా అనిపిస్తోంది. ఇది నాకు లభించిన గొప్ప గౌరవమని అన్నారు. పవన్‌దీప్ రాజన్‌ది ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లా. 2015లో పవన్‌దీప్ వాయిస్ ఇండియా షోలో విజేతగా నిలిచాడు.

కాగా..ఇండియన్ ఐడల్ 12 సీజన్లో షణ్ముఖ ప్రియ విన్ అవుతుందని అంతా భావించారు. కానీ, సింగర్ పవన్ దీప్ రాజన్ గెలవడంతో.. షణ్ముఖ ప్రియ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యాడరు. టైటిల్ కోసం తొలిసారిగా ఒక తెలుగమ్మాయి పోటీ పడుతుందటంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులు ఆమె గెలుపు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ, షణ్ముఖ ప్రియ ఈ ఫైనల్లో ఆరో ప్లేస్ లో నిలిచింది

