telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కేంద్రం నుండి మరో భారీ తాయిలం…పన్ను పరిమితి..

ఇటీవల ప్రకటించిన అగ్రవర్ణాల రిజర్వేషన్ విజయవంతం అయినట్టుగానే ఉంది, దీనితో మరో భారీ తాయిలంతో కేంద్రప్రభుత్వం ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం మరో భారీ ప్రకటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో భారీ తాయిలం ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు ఆదాయపు పన్ను పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే.. ప్రస్తుతం ఉన్న పరిమితి రెట్టింపు అవుతుందన్నమాట. అదే జరిగితే కోట్లాదిమంది మధ్యతరగతి వారికి భారీ ఊరట లభించినట్టే. త్వరలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం, ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తాయిలాలతో బీజేపీ గట్టెక్కుతుందా అనేదే ఇక్కడ ప్రశ్న. దానికోసం ఎన్నికల ఫలితాలవరకు ఆగాల్సిందే.

Related posts