telugu navyamedia
సినిమా వార్తలు

ఏ పార్టీలో చేరడం లేదు… క్లారిటీ ఇచ్చిన సంజయ్ దత్

Sanjay-Dutt

సెప్టెంబర్ 25న సంజయ్ దత్ రాష్ట్రీయ సమాజ్ పక్ష్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర మంత్రి మహాదేవ్ జంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షమైన ఆర్.ఎస్.పీలో సంజయ్ దత్ చేరబోతున్నట్లు శివాజీపార్క్ లో జరిగిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో జంకర్ వెల్లడించారు. సంజయ్ దత్ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారని, ఆయన పార్టీలో చేరతారని దత్ వీడియోను కార్యకర్తల సమావేశంలో ప్రదర్శించారు. అయితే ఈ విషయంపై స్పందించిన సంజయ్ దత్ ఈ వార్తలను కొట్టిపారేశారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని దత్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్పీ చీఫ్ మహాదేవ్‌ జంకర్‌ నాకు మంచి స్నేహితుడు. సోదరుడిలాంటి వారు. మహదేవ్ జంకర్‌ భవిష్యత్ లో అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సంజయ్ దత్ చెప్పారు. సంజయ్ దత్ పదేండ్ల క్రితం సంజయ్‌ దత్‌ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు.

Related posts