టాలీవుడ్ మన్ముథుడిగా పేరొందిన నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనికి కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అఖిల్‌పై మనసు పారేసుకున్నా అంటూ తాజాగా సంచలన విషయాన్ని తెలియజేసింది యాంకర్ విష్ణు ప్రియ. అంతే కాదు అతనంటే పిచ్చని.. ఎంత పిచ్చి అంటే అఖిల్ పేరును పచ్చ బొట్టు వేసుకునేంత. ఓ షోలో శ్రీముఖి… విష్ణుప్రియ గురించి బయటపెట్టేసింది. “ఒకవేళ దేవుడు గానీ ప్రత్యక్షమై ఏదైనా కోరిక అడిగితే.. అఖిల్ అక్కినేనితోటి పెళ్లి చెయ్యమని అయితే కచ్చితంగా అడుగుద్ది. నేను ఎందుకో బిగ్ బాస్ అప్పుడు అది అడగలేకపోయాను నాగార్జునగారిని. కానీ ఆమెకు అఖిల్ అంటే పిచ్చి, గజ్జి.. ఇంకేవైనా ఉంటే అవి.. అన్నీ.. ఇదిగో నీ టాటూ చూపించు..’ అంటూ శ్రీముఖి అడగడంతో… విష్ణు ప్రియ తన చేతికి ఉన్న A (అఖిల్) అండ్ విష్ణుప్రియ అని ఉన్న తన చేతి టాటూని చూపించింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి అఖిల్‌ని పెళ్లాడాలనే కోరిక విష్ణు ప్రియ కోరిక తీరుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.
previous post