telugu navyamedia
తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్​ రేప్‌ కేసు : పోలీసుల సంచలన నిర్ణయం

*జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో పోలీసుల సంచలన నిర్ణయం
*జూబ్లీహీల్స్ రేప్ కేసులో కీల‌కం కానున్న పోలీసుల క‌స్ట‌డీ..

*కేసులో ప్రధాన నిందితుడు A-1 సాదుద్దీన్​ను చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు.
* ఏ-1 నిందితుడికి వైద్య ప‌రీక్ష‌ల కోసం ఉస్మానియా ఆస్ప‌త్ర‌కి త‌ర‌లింపు
*మైన‌ర్లుకు ప్ర‌భుత్వ వైద్యుల‌తో పొటెన్సీ టెస్ట్‌..

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టైన మైనర్లను ట్రైల్‌ సమయంలో మేజర్లుగానే పరిగణించాలని జువైనల్‌ జస్టిస్‌ బోర్డును హైద్రాబాద్ పోలీసులు కోరారు. ఈ విషయమై జువైనల్ జస్టిస్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోననేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.

ఈ కేసులో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఒక్కరు మేజరు , ఐదుగురు మైనర్లేనని పోలీసులు చెబుతున్నారు.

అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌కు కేసులో ప్రధాన నిందితుడు A-1 సాదుద్దీన్​ను చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారించాల్సి ఉన్నందున సాదుద్దీన్​ను కస్టడీకి ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం 4 రోజులు అనుమతిచ్చింది.

నేటి నుంచి అతణ్ని కస్టడీలోకి తీసుకుని విచారించ‌నున్నారు.సాదుద్దీన్​ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు.. అత్యాచార ఘటనను సీన్​ రీ-కన్​స్ట్రక్షన్​ చేయనున్నారు. పబ్​లో జరిగిన ఘటన బాలికను ట్రాప్ చేసిన అంశాలపై అతడిని విచారించనున్నారు.

జువైనల్‌ హోంలో ఉన్న మిగిలిన ఐదుగురు మైనర్లను కూడా విచారించ‌నున్నారు, కోర్టు అనుమతికోసం ఎదురు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు జువైనల్ హోంలో ఉన్న నిందితులు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే ఈ తరుణంలో మైనర్ నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు హైద్రాబాద్ పోలీసులు.

మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడానికి వారికి ఉన్న సామర్థ్యం అన్నిటిని పరిగణలోకి తీసుకొని జువైనల్‌ జస్టిస్‌ నిర్ణయం వెల్లడించనుంది. మైనర్లకు 21 ఏళ్లు దాటిన తర్వాత వారిని జువైనల్‌ హోం నుంచి సాధారణ జైలుకు తరలించనున్నారు.

Related posts