బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదంలో 56 మంది సజీవ దహనమయ్యారు. మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఓ భవనంలోని కెమికల్ గోదాంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే చుట్టుపక్కల భవనాలకు వ్యాపించాయి. మంటలు చెలరేగిన ప్రాంతం ఇరుగ్గా ఉండడం, భవనాల మధ్య దూరం తక్కువగా ఉండడంతో మంటలు ఓ భవనం నుంచి మరో భవనంలోకి త్వరగా వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది రాత్రి నుంచి మంటలను అదుపు చేస్తూనే ఉన్నారు. మృతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫైర్ సర్వీస్ చీఫ్ అలీ అహ్మద్ తెలిపారు. భవనాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు చౌక్ బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉందని మంటల ధాటికి పలువురు ప్రయాణికులు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
చంద్రయాన్-2 వైఫల్యంపై పాక్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు