కన్నడ సినీ నటుడు, నిర్మాత హుచ్చా వెంకట్. కర్ణాటకలోని హిందూపురం-యలహంక మార్గంలోని మారసంద్ర టోల్ గేట్ వద్ద.. తన కారును నిలిపి, దిగాడు. అక్కడ ఉన్న బస్ స్టాప్ వద్ద ఓ కాలేజీ యువతి బస్ కోసం ఎదురు చూడటంతో ఆమె వద్దకు వెళ్లి.. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఆమె భయపడి పక్కకు వెళ్లడంతో, వెంటే వచ్చాడు. దీంతో ఆమె భయంతో అక్కడి నుంచి పరుగులు తీసింది. ఏమైందో ఏమో తెలీదు కానీ.. తన కారు అద్దాలను తానే పగలగొట్టుకున్నాడు. అది చూసిన స్థానికులు వెంకట్‌పై పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, హుచ్చ వెంకట్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల మైసూరు, కొడగు, సకలేశపుర తదితర ప్రదేశాల్లో కూడా వింతగా ప్రవర్తించాడు. స్థానికులతో గొడవపడి, దెబ్బలు కూడా తిన్నాడు.
next post