*బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై తెరాస శ్రేణుల దాడి.
*పోచం మైదాన్ కూడలిలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై దాడి..
*కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన
*బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టిన ఆందోళనకారులు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాకేష్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం నుంచి ర్యాలీగా నర్సంపేటకు ర్యాలీగా అంతిమయాత్ర కొనసాగుతంది.. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు.. ఒక్కసారిగి వరంగల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆఫీసుకు నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

రాకేష్ స్వగ్రామం దబ్బీర్ పేట వరకూ అంతిమ యాత్ర సాగనుంది. సాయంత్రం రాకేష్ అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా ఈ అంతిమయాత్రలో టీఆర్‌ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎస్పీ, వామపక్ష కార్యకర్తలు కేంద్ర్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు పట్టుకంటూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అంతకుముందు ఎంజీఎం వద్ద రాకేష్ మృతదేహానికి మంత్రులు, నేతలు నివాళులర్పించారు.రాకేష్ మృతికి కేంద్ర ప్రభుత్వమే కారణమని టీఆర్ ఎస్ నేతలు ఆరోపించారు. కేంద్రం అనాలోచిత విధానాలతో యువకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువతకు ప్రధాని క్షమాపణలు చెప్పాలన్న మంత్రి ఎర్రబెల్లి.. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసేంతవరకు పోరాడతామని స్పష్టం చేశారు. రాకేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎర్రబెల్లి.. రాకేష్ స్వగ్రామం డబీర్‌పేట వరకూ అంతిమ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు.

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌ను నిరసిస్తూ శుక‍్రవారం ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులపై అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన రాకేశ్ మృతిచెందాడు. దీంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

