telugu navyamedia
ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వం 122 మంది తెలంగాణ ఉద్యోగుల ను రిలీవ్ చేసింది

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు ఏపీ సర్కార్ ఏపీలో పని చేస్తున్న తెలంగాణా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగులను.. తిరిగి వారి సొంత రాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు మొత్తం 122 మంది తెలంగాణా స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ స్పష్టం చేసింది.

తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్లోని చివరి ర్యాంక్లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts