తెలంగాణ హైకోర్టు దేవరాయాంజల్ భూముల సర్వేపై విచారణ జరిపింది. ఐఏఎస్ ల కమిటీ ఏర్పాటు జీవో కొట్టివేయాలని కోరుతూ సదా కేశవ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపారు. జీవో 1014 అమలు నిలిపివేసేందుకు నిరాకరించిన హైకోర్టు… ఆలయ భూములు గుర్తించేందుకు విచారణ చేస్తే ఇబ్బందేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా… కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనీయాలా అని అడిగింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని తెలిపింది. నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వస్తున్నారని పిటిషనర్ తెలిపారు. దేవరాయాంజల్ భూములపై విచారణ చేసే స్వేచ్చ కమిటీకి ఉందని స్పష్టం చేసిన హైకోర్టు.. భూముల్లోకి వెళ్లే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్లపై వ్యతిరేక చర్యలు తీసుకుంటే, ముందస్తు నోటీసు ఇవ్వాలని పేర్కొంది. కమిటీకి అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. పిటిషనర్లు విచారణకు సహకరించక పోతే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు… కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
							next post
						
						
					


పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు: చినరాజప్ప