telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు నాయుడు

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు  నటుడిగా అగ్రస్థాయిలో నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీబాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు.

కాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అందరూ ఆయన విషెస్ తెలుపుతున్నారు. సినీ సెలబ్రెటీలు, అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలుపుతున్నారు.

మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం… అణువణువునా సామాజిక స్పృహ… మాటల్లో పదును…

చేతల్లో చేవ… జన సైన్యానికి ధైర్యం… మాటకి కట్టుబడే తత్వం… రాజకీయాల్లో విలువలకు పట్టం….స్పందించే హృదయం…అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానుల,

కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లూ వర్ధిల్లాలి…మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి.

పాలనలో, రాష్ట్రాభివృద్దిలో మీ సహకారం మరువలేనిది అని తెలియజేస్తూ…..మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని సీఎం చంద్రబాబు నాయుడు  ట్విట్టర్ ద్వారా  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

 

Related posts