telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

శృంగార ప్రియులకు గుడ్ న్యూస్.. కరోనా టైమ్ లో ఇలా చేస్తే మంచిదేనట !

sex

రొమాన్స్ అనేది కపుల్స్ మధ్య కలహాలను తగ్గించి సాన్నిహిత్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీ, పురుషులిద్దరి మధ్య భావోద్వేగ బంధం పెరగడానికి కూడా సహాయపడుతుంది. వయసులో ఉన్న ప్రతి ఒక్కరికీ, పెళ్లి చేసుకున్న ప్రతి జంటకు, ప్రేమలో ఉన్న ప్రేమికులకు రొమాన్స్ అనేది ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. అయితే జంటల మధ్య ఆ కార్యం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర కాలంలో ఇలా చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయట..  ఇమ్యూనిటీ పవర్.. ఇలాంటి సమయంలో కరోనా నుండి తమను తాము కాపాడుకోవడానికి రోగనిరోధకశక్తి పెంచుకోవడం అనేది ప్రధానం. కాబట్టి జంటలు రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తే.. అలాంటి వారిలో ఇమ్యూనిటీ పవర్ ఈజీగా పెరుగుతుందని.. దీని వల్ల కరోనా వచ్చే పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.  మనలో చాలా మంది పని ఒత్తిడి, గర్భం వస్తుందనే భయంతో పాటు ఇతర కారణాల వల్ల ఆ కార్యాన్ని ఆస్వాదించడం లేదు.

అయితే ఏ జంటలైతే ప్రతిరోజూ రెగ్యులర్ గా రొమాన్స్ లో పాల్గొంటారో.. అలాంటి వారికి ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ పై యుద్ధం.. విల్క్స్ యూనివర్సిటీ చేసిన ఓ పరిశోధనలో ఇటీవల కొన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. రెగ్యులర్ రొమాన్స్ చేస్తూ.. ఆ కార్యాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో.. వారిలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని.. అంతేకాదు వారి బాడీ వైరస్, క్రిములపై బాగా పోరాటం చేస్తాయని తేలిందట. వారంలో కనీసం రెండు లేదా మూడుసార్లు ఆ కార్యంలో పాల్గొనేవారు.. ఏదైనా రోగం వస్తే చాలా త్వరగా కోలుకుంటున్నారట. కరోనా వంటి కాలంలో రెగ్యులర్ గా తగిన జాగ్రత్తలు పాటిస్తూ రొమాన్స్ చేసినా.. ఆ కార్యంలో పాల్గొన్నా ఒత్తిడిని పూర్తిగా జయించడమే కాదు.. ఎక్కువ సమయం పాటు చురుకుగా ఉండొచ్చు. దీని వల్ల మీ బ్లడ్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ లో ఉంటాయట. మీ గుండె పనితీరు కూడా మెరుగుపడుతుందట. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. హార్ట్ ఎటాక్ తో.. ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ వచ్చిన వారిలో చాలా మంది గుండెపోటు కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారని తేలిందట. అయితే ఎవరైతే రతి క్రీడలో ఎక్కువగా పాల్గొంటారో.. ఆ క్రీడను ఎవరైతే బాగా ఎంజాయ్ చేస్తారో.. అలాంటి వారికి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. క్యాలరీల ఖర్చు.. ఆ కార్యంలో పాల్గొనడం వల్ల మీ బాడీలో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. మీరు జిమ్ కు వెళ్లి గంటలకొద్దీ గడిపినప్పుడు వచ్చే ఫలితాలు.. కలయికలో పాల్గొన్న కొద్దినిమిషాలకే వచ్చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కరోనా పెరుగుతున్న కాలంలో మీరు అనవసరమైన అపొహలు పెట్టుకుని.. మీ దాంపత్య జీవితాన్ని ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్ కు దూరంగా ఉండకుండా.. ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదించాలని, అప్పుడే మీ ఆరోగ్యం పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు

Related posts