telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో హిజ్రాలు వీరంగం

హైదరాబాద్ నగరంలో హిజ్రాల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డబ్బులు అడిగి ఇవ్వకపోతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. అమాయకులను వేధించినందుకు బాచుపల్లి పోలీసులు 8 మంది ట్రాన్స్‌జెండర్లు, ఇద్దరు అటో డ్రైవర్లపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. బాచుపల్లి పియస్ పరిధిలోని ప్రగతినగర్ లో పంచంగం చలతి తన కొడుకు వివాహం 24వ తేదీన జరిపి, 25వ తేదీ ఉదయం 5గంటలకు  సత్యనారాయన స్వామి వ్రతం చేయబోతుండగా 8మంది ట్రాన్స్ జెండర్స్ 2 ఆటోలలో చలపతి ఫ్లాట్ వద్దకు వచ్చి 20,000వేల నగదు ఇవ్వమని డిమాండ్ చేశారు. చలపతి అంత డబ్బు ఇవ్వలేనని తెలపగా ఆ ట్రాన్స్ జెండర్స్ చలపతిని, కుటుంబ సభ్యులు, బంధువులను బెదిరించడంతో పాటు వారు కట్టుకున్న చీరలను అసభ్యంగా విప్పి కలకలం సృష్టించారు.

బాధితుడు చలపతి విసిగివేసారి వారికి రూ.16,500/- ఇచ్చి వారిని అక్కడ నుండి పంపించేసి వెంటనే బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని‌ 08 మంది ట్రాన్స్ జెండర్స్ ఇద్దరు ఆటో డ్రైవర్లు కరణ్ గుప్తా, మాసి కామన్ మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసారు. వివాహాలు, షాప్ ఓపెనింగ్స్, హౌస్ వార్మింగ్, బర్త్ డే పార్టీలు మరియు శుభ దినాలలో ప్రజలు తమ ఇళ్ళలో లేదా ఫంక్షన్ హాల్స్ లేదా వాణిజ్య కార్యక్రమాలలో నిర్వహించే ఫంక్షన్ల షెడ్యూల్ తేదీల గురించి సమాచారాన్ని ట్రాంస్జెండర్స్ ముందే సేకరిస్తారని, నిర్వాహకుల నుండి భారీగా డబ్బు డిమాండ్ చేస్తారని, డబ్బు ఇవ్వకపోతే బాధితులను భయపెడతూ బెదిరిస్తూ పరువు తీస్తారని బాచుపల్లి సిఐ తెలిపారు.  

Related posts