telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

రాగి పాత్రలోని నీరు తాగితే ఈ సమస్యలన్నీ మాయం

శరీరానికి నీరు ఎంతగానో అవసరం ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం ఇవాళ వాటర్ ప్యూరిఫైయర్ల తో నీటిని శుద్ధి చేసుకుంటున్నాం. కానీ ఇదే పని రాగి పాత్ర కూడా చేస్తుంది. పూర్వకాలంలో మన వాళ్ళు నీటిని రాగి పాత్రల్లో నిల్వ చేసేవారు. రాగి పాత్ర నీటిని సహజ పద్ధతుల్లో శుద్ధి చేస్తుంది. శరీరానికి హాని చేసే బాక్టీరియా, మైక్రో ఆర్గానిజం, ఫంగస్… వంటి వాటిని రాగి చంపేసి, నీటిని తాగడానికి పనికొచ్చే విధంగా మారుస్తుంది. అంతే కాదు, రాత్రాంతా రాగి పాత్ర లో ఉన్న నీటికి రాగి నుంచి ఒక మంచి గుణం వస్తుంది. మన ఆరోగ్యానికి కావాల్సిన మినరల్స్‌లో రాగి ఒకటి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెనిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ని బయటికి పంపిస్తాయి. శరీరం లో జరిగే చాలా ప్రాసెస్ ల లో కాపర్ ప్రముఖంగా ఉంటుంది. సెల్ ఫార్మేషన్ దగ్గర్నించీ, ఐరన్ అబ్జార్ప్షన్ వరకూ కాపర్ లేకుండా ఏ పనీ జరగదు. అందువల్లనే కాపర్ ఎనీమియా రాకుండా చేస్తుంది. రాగిలో బాక్టీరియాని నశింపచేసే గుణాలు ఉన్నాయి. ఇది ఈ.కోలీ లాంటి బాక్టీరియాని కూడా చంపగలదు. దీంతో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. రెగ్యులర్ గా రాగి పాత్ర లో ని నీటిని తాగితే అది తొందరగా కొవ్వుని కరిగించడమే కాక దాన్ని బయటికి పంపేస్తుంది కూడా. ఒక్క మాట లో చెప్పాలంటే డీటాక్స్ చేస్తుంది. అంతేకాకుండా జీర్ణసమస్యలు దూరం అవుతాయి. రాగి పాత్ర లోని నీరు హానికరమైన బాక్టీరియా ని చంపేసి అల్సర్స్ నీ, ఇండైజెషన్ నీ, ఇంఫెక్షన్స్ నీ తగ్గిస్తుంది. సీ ఫుడ్, ఆర్గన్ మీట్, హోల్ గ్రెయిన్స్, పప్పులు, గింజలు, చాక్లేట్, బంగాళా దుంపలు, బఠానీలు, ముదురురంగు ఆకుకూరల నుంచి మనకి రాగి లభిస్తుంది. రాగి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతే కాదు, రాగి బీపీని కంట్రోల్ లో ఉంచి చెడు కొలెస్ట్రాల్ నీ, ట్రైగ్లిసరైడ్స్ నీ తగ్గిస్తుంది. అంతేనా కాన్సర్ ముప్పుని తగ్గిస్తుంది. ఈ నీరు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వయసు కనిపించనివ్వకుండా చేస్తుంది. శరీరంలో మెలనిన్ ఉత్పత్తి అవ్వడంలో కాపర్ పాత్ర చాలా ఉంది. పైగా అది చర్మాన్ని స్మూత్ గా ఉంచుతుంది. ఇందులో ఉన్న యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాల వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. థైరాయిడ్ డిసీజెస్ తో బాధ పడుతున్నవారందరిలో ఉండే ఒక కామన్ ప్రాపర్టీ వారి శరీరంలో కాపర్ తక్కువ ఉండడమే అని నిపుణుల అభిప్రాయం. దీంతో పాటు ఆర్థ్రైటిస్ ని అదుపులో ఉంటుంది.

Related posts