వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ని విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచిన వర్మ బాలల దినోత్సవం సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ ఫోటో చూడగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఫోటో గుర్తొచ్చేలా ఉంది. ఫోటోలో టీడీపీ నేత నారా లోకేష్ పాత్రధారి.. తన కుమారుడితో ఆడుకోవడం చూడవచ్చు. కొడుకుతో ఆడుకుంటున్న లోకేష్‌ను చంద్రబాబు పాత్రధారి ఒకింత సీరియస్‌గా చూడటం కూడా గమనించవచ్చు. నవంబర్ 14న బాలల దినోత్సం కావడంతో.. చిన్నారి దేవాన్ష్‌తో లోకేష్ ఆడుకుంటున్న ఫోటోను రిలీజ్ చేశారు. ఇప్పటికే “పప్పు లాంటి అబ్బాయి” సాంగ్‌తో లోకేష్‌ను టార్గెట్ చేసిన వర్మ.. తాజా ఫోటోతో లోకేష్‌ను మరోసారి పరోక్షంగా టార్గెట్ చేశారు.
Happy Children’s Day photo from KAMMA RAJYAMLO KADAPA REDDLU #KRKR pic.twitter.com/UfvVklviG0
— Ram Gopal Varma (@RGVzoomin) 14 November 2019


నటించడం మానేసి చదవమంటున్నారు.. ప్రియా వారియర్