రేపు టీడీపీ ఛలో ఆత్మకూరు కు పిలుపునివ్వడంతో, పోటీగా వైసీపీ కూడా ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో గుంటూరులో టీడీపీ నిర్వహిస్తున్న పునరావాస శిబిరం వద్ద ఈ సాయంత్రం భారీగా పోలీసులు మోహరించారు. సుమారు 40 పోలీసు వాహనాలు శిబిరం వద్ద దర్శనమిస్తున్నాయి.
కొన్నిరోజులుగా గుంటూరులో టీడీపీ శిబిరం నిర్వహిస్తోంది. పల్నాడులోని కొందరు వైసీపీ దాడులు తట్టుకోలేక గ్రామాలు విడిచి వెళ్లిపోతున్నారని, అలాంటి వారి పునరావాసం కోసమే తాము గుంటూరులో శిబిరం ఏర్పాటు చేసినట్టు టీడీపీ చెబుతోంది.రేపు టీడీపీ, వైసీపీ ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తమయ్యారు.