telugu navyamedia
వ్యాపార వార్తలు

ఢిల్లీలో సమావేశమై జీఎస్టీ కౌన్సిల్.. ఎలక్ట్రిక్ వాహనాల పై పన్ను తగ్గింపు

fake claims in gst found and investigating

ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా కేంద్రం అడుగులు వేస్తుంది. వాటి చార్జర్లపై విధిస్తున్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ తొలిసారిగా  ఈరోజు ఢిల్లీలో సమావేశమయింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. 

తగ్గించిన పన్నులు ఆగష్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బస్సులను అద్దెకు తీసుకుంటే వాటిపై కూడా జీఎస్టీని మినహాయించాలని ఈ భేటీలో తీర్మానించినట్లు చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం గత గురువారమే జరగాల్సినప్పటికీ నిర్మలా సీతారామన్ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాల్సి రావడంతో ఈ భేటీ వాయిదా పడింది.

Related posts