రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దేతడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు శంషాబాద్ లోని వ్యవసాయ క్షేత్రం లో మొక్కలు నాటిన ప్రముఖ నటుడు నోయెల్ సేన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు అనేవి మనకు చాలా చాలా అవసరం అని వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి కోరారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా అద్భుతం మైన కార్యక్రమం అని అందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భం గా బిగ్ బాస్ 4 రియాల్టీ షో లో నాతో పాటు పాల్గొన్న సుజాత, కుమార్ సాయి, దీప్తి సునైనా, నాగవల్లి, రమ్య బెహ్రా, దివి లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు నోయెల్ సేన్.
							previous post
						
						
					
							next post
						
						
					

