telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో కరోనా విలయం : షర్మిల సంచలన నిర్ణయం..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కరోనా బాధితులను అదుకునేందుకు “ఆపదలో తోడుగా YSSR”అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. “తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం కోల్పోకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి .. మళ్ళి మీ జీవితం సాఫీగా సాగేందుకు..మీరంతా మన YSR కుటుంబసభ్యులుగా భావించి ..నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకొంటున్నాను. మన “ఆపదలో తోడుగా YSSR టీం” ఫొన్ నంబరు 040-48213268 కు మీ సమాచారాన్ని తెలియజేయండి తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది ఈ కరోనా బారిన పడి చనిపోయారు. కుటుంబ పెద్దదిక్కు తండ్రి / భర్త / కొడుకును కరోనాకు కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల బాధను కాస్తైనా పంచుకోవాలని “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు చేస్తున్నాను” అంటూ షర్మిల ప్రకటన చేశారు.

Related posts