telugu navyamedia
రాజకీయ

ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం..

గణతంత్ర దినోత్సం సందర్భంగా 2022 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా ఇచ్చే ‘‘పద్మ’’ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం వరించిన వాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది.

పద్మ అవార్డు గ్రహీతల్లో 128 మంది పేర్లు ఉన్నాయి. వీరిలో నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు.

ఈ ఏడాది పద్మవిభూషణ్‌కు మొత్తం నలుగురి పేర్లను ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ఈ గౌరవం లభించింది.

ఇటీవ‌ల తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దివంగత మాజీ CDS జనరల్ బిపిన్ రావత్, (మరణానంతరం),తో పాటు దివంగత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ (మరణానంతరం), రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం) ప్రభా ఆత్రే లకు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.

అలాగే కాంగ్రెస్‌ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీకి పద్మ భూషణ్, మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మెహ్రిషిని , మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌లను కూడా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనున్నారు.

తెలుగురాష్ర్టాలు వారికి…

ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి  ప‌ద్మ అవార్డులు వ‌రించిన‌వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏడుగురు ఉన్నారు.. మొత్తంగా ఏడుగురు తెలుగువారు ప‌ద్మ అవార్డులు ద‌క్కించుకున్నారు.. అందులో నలుగురు తెలంగాణకు చెందిన‌వారు కాగా.. ముగ్గురు ఏపీవారున్నారు..

కొవిడ్‌ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్ తెలంగాణ నుంచి భారత్‌ బయోటెక్‌ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు.

తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు)..
ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, గోసవీడు షేక్‌ హాసన్‌ (కళలు) (మరణానంతరం), డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం)ల‌కు పద్మశ్రీ వరించింది.

Related posts