అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 16 లక్షల మంది విద్యార్థులకు ఎన్95 యాంటీ పొల్యూషన్ మాస్క్‌లు ఉచితంగా అందజేస్తున్నామని అన్నారు.
శుక్రవారం నుంచి ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు ఎన్95 మాస్క్‌లు పంపిణీ చేస్తామని అన్నారు. ఒక్కో విద్యార్థికి రెండేసి మాస్క్‌లు పంపిణీ చేస్తామని చెప్పారు. పంజాబ్, హర్యానా, యూపీ పంట పొలాల్లో గడ్డి దుబ్బలకు రైతులు నిప్పుపెట్టడం ఢిల్లీ కాలుష్య కారణాల్లో ఒకటని అన్నారు. దీన్ని వెంటనే నిలిపేయాల్సిందిగా రైతులకు ఆదేశాలు ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేజ్రీవాల్ కోరారు.