బోనాలు పండగ ప్రారంభమైన వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
పెండింగ్‌లో ఉన్న రూ. 180.30 కోట్ల మేర మెడికల్ బకాయిలను క్లియర్ చేసినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు.
దీని వల్ల 26, 519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించనుందన్నారు. గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులనూ సైతం క్లియర్ చేసినట్లు ఆయన వివరించారు.
రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. అయినా భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
అయినప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ బకాయి నిధులను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదాహరణగా విపులీకరించారు.
ఈ పెండింగ్ బకాయిలు విడుదల చేయడం పట్ల ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.