telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

పెరుగుతున్న పసిడి ధర..10 గ్రాములకు రూ.52,301

Gold rates hike

కరోనా కేసుల ఉద్ధృతి వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ప్యాకేజీలను ప్రకటించడంతో పసిడి ధర 2000 డాలర్లకు చేరడానికి కారణమైందని నిపుణులు అంటున్నారు. పసిడి ధర దేశీయంగా రెండు రోజుల్లో రూ.1500 పెరిగింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఈ రోజు ఉదయం 10 గ్రాముల పసిడి ధర రూ.52,301కి చేరింది.

నిన్న రాత్రి రూ.1066 లాభంతో రూ.52,101 వద్ద స్థిరపడిన బంగారం ధర ఈ రోజు ఉదయం రూ.200ల లాభంతో రూ.52301 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లోనూ తొలిసారి ఔన్స్‌ బంగారం 2000 డాలర్లకు చేరింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.67,000గా ఉంది. భవిష్యత్తులో పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో పసిడి డిమాండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

Related posts