ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇందుకోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆగస్టు 15 పరేడ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు. ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా భద్రత విషయంలో రాజీపడబోవడంలేదని పేర్కొన్నారు.
previous post


ఎన్నికల్లో పోత్తులపై పవన్ తో చర్చలు: కేఏ పాల్