డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీగా గ్యాస్ లీకైంది. మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకవుతోంది.
సోమవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. సుమారు 2 గంటలపాటు గ్యాస్ పైకి చిమ్మింది.
చుట్టుపక్కల ప్రజలు వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు ఘటనాస్థలిని పరిశీలించారు. ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలం ను తహసీల్దారు శ్రీనివాసరావు పరిశీలించారు. ఓఎన్‌జీసీ సంస్థ సాంకేతిక నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
గ్యాస్ లీక్ ఘటనతో ఆ చుట్టుపక్కల నివసిస్తున్నవారు ఆందోళనకు గురౌతున్నారు.

