telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

డాక్టర్లకు ఉచితంగా కరోనా వైద్యం ఇవ్వనున్నట్లు తెలిపిన నిమ్స్

కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో భారీగానే తన ప్రభావం చూపిస్తుంది. రోజుకు మూడు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ కరోనాను ఎదుర్కోవడంలో వైద్యులు ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక గత కొంతకాలంగా హెల్త్ కేర్ సిబ్బందికి కోవిడ్ ట్రీట్మెంట్ కి నిమ్స్ లో ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తుల వచ్చాయి. జూనియర్ డాక్టర్లు కూడా నిన్నటిదాకా సమ్మె లో ప్రధానమైన డిమాండ్ గా కూడా చేర్చారు. ఎట్టకేలకు నిమ్స్ ఆస్పత్రి వర్గాలు డాక్టర్లకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది. డాక్టర్లకు ఉచితంగా కరోనా వైద్యం ఇవ్వనున్నట్లు తెలిపింది నిమ్స్ ఆసుపత్రి. అందుకుగాను ఒక RMO తో పాటు పల్మానోలజీ మెడిసిన్ నోడల్ ఆఫీసర్ గా నియమించింది. అయితే ఈ నిర్ణయం పై వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts