telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏ తప్పు చేయలేదు: మాజీ మంత్రి కేటీఆర్‌

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతించారు.

ఈ క్రమంలో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతిపై కేటీఆర్ స్పందించారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చేసుకుపోనివ్వండన్నారు.

ఫార్ములా ఈ రేసింగ్‌లో తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహరంపై లై డిటెక్టర్‌ టెస్ట్‌కు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు.

తాము మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని అన్ని లెక్కలు తేలుస్తామన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని అరెస్ట్ జరగదని ధీమా వ్యక్తం చేశారు.

Related posts