telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్

T Congress boycott mlc elections

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం ఒక్క స్థానంలో పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం తమ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నందున ఆ పార్టీకి టీఆర్ఎస్ మద్దతును ప్రకటించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం ఉందని కాంగ్రెస్ పార్టీ గూడురు నారాయణరెడ్డిని బరిలోకి దింపింది. మొన్నటి ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 19 , టీడీపీకి రెండు అసెంబ్లీ స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు అవసరమైన ఓట్లు లేకుండాపోయాయి. ఈ మేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.

 

Related posts