telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

బంగ్లాదేశ్‌ సీనియర్ స్పిన్నర్ ముషారఫ్ కు కరోనా

musharaf

బంగ్లాదేశ్‌కి చెందిన మరో సీనియర్ స్పిన్నర్ ముషారఫ్ హుస్సేన్‌ తనకి కరోనా వైరస్ సోకినట్లు తాజాగా వెల్లడించాడు. వాస్తవానికి ముషారఫ్‌ కంటే ముందు అతని తండ్రికి కరోనా వైరస్ వచ్చింది. దాంతో.. అతడ్ని సీహెచ్‌ఎమ్ ఆసుపత్రికి తరలించిన ముషారఫ్.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఇటీవల వెల్లడించాడు. కానీ.. గత మూడు రోజుల నుంచి తనలో కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంలో అనుమానంతో పరీక్ష చేయించుకోగా.. కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు ముషారఫ్ వెల్లడించాడు. కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్‌ రాగానే.. తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు ముషారఫ్ తెలిపాడు. అయితే.. తన భార్య, బిడ్డకి మాత్రం పరీక్షల్లో నెగటివ్ రావడంతో.. వారిని తన అత్తమామ వాళ్లింటికి పంపినట్లు ఈ బంగ్లాదేశ్ సీనియర్ స్పిన్నర్ వెల్లడించాడు.ఇక గత ఏడాది బ్రెయిన్ ట్యూమర్‌కి ముషారఫ్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. బ్రెయిన్ ట్యూమర్‌కి సర్జరీ తర్వాత ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో ముషారఫ్ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. కాగా జూన్ నెలలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్రఫె మొర్తజా ఈ మహమ్మారి బారినపడి దాదాపు నెల రోజుల తర్వాత కోలుకోగా.. నజ్ముల్లా ఇస్లామ్, నఫీస్ ఇక్బాల్ కూడా కరోనా వైరస్‌ బారినపడ్డారు.

Related posts