telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

హోలీ రోజు .. మసూద్ దిష్టిబొమ్మ దహనం చేసిన ప్రజలు..

masud scaffold fired on holi

సాధారణంగా ఏ పండుగకైనా దానికి సంబందించిన విధివిధానాలు ఉంటాయి. అలాగే హోలీ పండగ ముందు రోజు రాత్రి హోలికా దహనం చేయడం సాంప్రదాయం. అయితే ముంబయిలోని వర్లీ ప్రాంతంలో హోలికకు బదులుగా 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా అధినేత మసూద్‌ అజార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా ముంబయిలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇలా మసూద్‌ బొమ్మను, చిత్రపటాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. వందేమాతరం నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు.

masud scaffold fired on holiఈ పండుగ నాడు ప్రజలు మసూద్‌తో పాటు ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌, అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహిం దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. ‘రాక్షసులను అంతం చేయాలి. అందుకే ఈ రోజు మసూద్‌, దావూద్‌, సయీద్‌ దిష్టిబొమ్మలను మేం తగలబెట్టాం. పుల్వామా దాడి లేదా మరో ఉగ్రదాడే కావొచ్చు.. మన దేశంలో జరిగే ఉగ్ర ఘటనలకు ఈ ముగ్గురే కారణం. వారికి శిక్ష పడాలి’ అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన శివసేన నేత ఒకరు తెలిపారు.

Related posts