రాజస్థాన్‌లోని జైపూర్‌లో మంగళవారం టపాకాయల గోడౌన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం… గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడ్డ వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. ఐదు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 30 నిమిషాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్‌రెడ్డి