telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

గుడ్ న్యూస్ : అంబేద్కర్ ఓపెన్ వర్షిటీ ప్రవేశల గడువు పొడిగింపు

students

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (M.A., M.Com, M.Sc., BLISc, MLISc, పీ.జీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి చివరి తేది అక్టోబర్ 28 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇంఛార్జి రిజిస్ట్రార్ డా. జీ. లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్స్ లో ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.inలో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని సూచించారు. ఇప్పటికే అడ్మిషన్ పొంది ఉంది వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీ చెల్లించలేకపోయిన డిగ్రీ కోర్సు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు, పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీ కట్టలేక పోయిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించికోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600 లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రం 040-23680333 / 555 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని తెలిపారు.

Related posts