telugu navyamedia
ట్రెండింగ్ విద్యా వార్తలు

విద్యావిషయాలు : .. ఈ సెట్ ఫలితాలు, .. డైట్‌సెట్‌ ప్రవేశ పరీక్ష..

e-cet results and diet cet exam today

నేడు ఈసెట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహించారు. నగరంలోని జేఎన్‌టీయూ ప్రాంగణంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విడుదల చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 27,123 మంది విద్యార్థులు హాజరయ్యారు.

నేడు డిప్లొమా ఇన్‌ ఎలమెంట్రీ ఎడ్యుకేషన్‌(డీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి గాను డైట్‌సెట్‌ ప్రవేశ పరీక్ష జరగనుంది. తెలుగు మీడియం విద్యార్థులకు ఉ. 10 నుంచి మ. 12గంటల వరకు, ఇంగ్లీషు, ఉర్దూ మీడియం విద్యార్థులకు మ. 2 నుంచి సా. 4గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 25వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు గోరింటాకు పెట్టుకోవద్దని, బయోమెట్రిక్‌ హాజరుకు ఇబ్బందులు ఉంటాయని అధికారులు సూచించారు. పరీక్ష హాల్లోకి కాలిక్యులేటర్లను కూడా అనుమతించబోమని తెలిపారు.

Related posts