కరోనా వైరస్ ఇంగ్లండ్ లో విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే 55 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో ఆ దేశంలో కరోనా మహమ్మారికి బలైనవారి సంఖ్య 177కు చేరింది. దేశవ్యాప్తంగా నాలుగు వేలకుపైగా కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం దేశవ్యాప్తంగా షట్‌డౌన్ ప్రకటించింది.
అన్నీ దేశాల్లో కరోనా చాపాకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 13 వేలకు చేరుకుంది. బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. దాదాపు 96 వేల మంది కోలుకున్నారు. వైరస్ నియంత్రణకు భారత్ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుండగా, చాలా దేశాలు షట్‌డౌన్ ప్రకటిస్తున్నాయి.
ఆనాడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం.. ఈనాడు మోదీకి పాదాభివందనం!