కరోనా నియంత్రనకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్, గచ్చిబౌలీలో 1500 పడకల ‘కోవిడ్’ ఆసుపత్రిని సిద్ధం చేసిందని తెలిపారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని మంత్రి కేటీఆర్, వైద్యాధికారులు, ఈటల సందర్శించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మరో 22 వైద్యకళాశాలల ఆసుపత్రులను కూడా కోవిడ్ హాస్పిట్సల్ గా మార్చామని చెప్పారు. . అనంతరం మొయినాబాద్ లోని భాస్కర్ మెడికల్ కళాశాల ఆసుపత్రి లోని అన్ని వార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యాధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


ఏపీలో అరాచక పాలన..కేంద్రం దృష్టిసారించాలి: యనమల