telugu navyamedia
సినిమా వార్తలు

మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఈషా రెబ్బా

eesha

సత్యదేవ్‌, ఇషారెబ్బా జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం “రాగల 24 గంటల్లో”. శ్రీరామ్‌’, ఫేమ్‌ ముస్కాన్‌ సేథ్, గణేశ్‌ వెంకట్రామన్‌ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈషా రెబ్బ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా తెరకెక్కుతోంది. పలు సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ పాత్రలు చేసిన ఈషాకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించడం ఈషాకు ఇదే తొలిసారి. ఈ సినిమాలో ఈషా లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలె విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts