telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖపట్టణంలో భూప్రకంపనలు..

ఆంద్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖప‌ట్నంలో భూప్రకంపనలు భ‌యందోళ‌న‌కు గురిచేసింది. న‌గ‌రంలోని ఆదివారం ఉద‌యం 6.00 ప్రాంతంలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ‘4 నుండి 5 సెకన్ల వరకు’ పెద్ద శ‌బ్ధంతో భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

మధురానగర్, బీచ్ రోడ్డు, మురళీనగర్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, అల్లిపురం, తాటిచెట్లపాలెం, బంగారమ్మపేట, జ్ఞానాపురం, తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అందరూ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఒక్క‌సారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

కాగా సమాచారం తెలుసుకున్న అధికారులు భూప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు..విశాఖలోని గాజువాకకు ఈశాన్య దిశగా 8.9 కి.మీ. దూరంలో.. భూమికి 10 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత 3.2గా ఉండవచ్చని భావిస్తున్నారు.

Related posts