వరుణ్ తేజ్, అథర్వ మురళి ప్రధాన పాత్రలలో హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గద్దలకొండ గణేష్. ప్రస్తుతం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న గద్దలకొండ గణేష్ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండకి రీమేక్ గా రూపొందింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అథర్వకి జంటగా మృణాలినీ రవి నటించింది. ఈ చిత్రం అమ్మడికి టాలీవుడ్ డెబ్యూ మూవీ కాగా, తొలి చిత్రంతోనే ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో మృణాలినికి తెలుగులో చాలా ఆఫర్స్ వస్తున్నాయట. అయితే హీరోయిన్ రోల్సే కాకుండా అన్ని రకాల పాత్రలు చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని మృణాలిని చెప్పుకొచ్చింది. దీని వలన నటనలో పరిణితీ కూడా చెందుతామని ముద్దుగుమ్మ చెబుతుంది. మృణాలినీ తమిళ నాట డబ్ స్మాష్‌తో పలు వీడియోలు చేసి మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఐటీ ఉద్యోగినిగా కూడా ఈ అమ్మడు పని చేస్తుంది.
previous post
అతన్నే పెళ్ళి చేసుకుంటా… లవ్ ఎఫైర్ పై కియారా కామెంట్స్