telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ అధినేతకు రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో తెలియదు: కవిత

బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌ కు అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో తనకు తెలియదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.

అమెరికా నుంచి వచ్చిన ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా అంతర్గతంగా అధినేతకు లేఖలు రాసి ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు తెలిపారు.

కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి చేసుకుని అమెరికా నుంచి వచ్చేలోపు తాను రాసిన లేఖ లీక్ అయ్యిందన్నారు ఎమ్మెల్సీ కవిత. అది రెండు వారాల క్రితం రాసిన లేఖగా చెప్పారు.

గతంలో కూడా తన అభిప్రాయాలను లేఖల ద్వారానే తండ్రి కేసీఆర్కు తెలియజేసేదానినని కవిత వివరించారు. అది తాను రెగ్యులర్గా ఇచ్చిన ఫీడ్ బ్యాక్ అని చెప్పారు.

పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకుల అభిప్రాయాలను, ప్రజల స్పందనను మాత్రమే తాను లేఖలో పొందుపరిచినట్లు తెలిపారు.

పార్టీ అధినేతకు రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో తెలియదని దీనిపై సమీక్షించుకోవాల్సిన అసవరం ఉందన్నారు కవిత.

తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు. కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయన్నారు.

తన నాయకుడు కేసీఆర్ అని ఆయన మార్గనిర్దేశకంలోనే ముందుకు వెళ్తామన్నారు.

Related posts