కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆరిజోనాలోని ఓ మాస్క్ లను తయారు చేసే కర్మాగారాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రకటించిన ఆంక్షలను తొలగించకుంటే, ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ కోసం నిబంధనలు సడలిస్తే, మరింత మంది మరణిస్తారని ఆయన అన్నారు.
నిబంధనలను తొలగించక తప్పదని, కొంతమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. అయినా సరే మనం మన దేశంలో అన్ని కార్యకలాపాలనూ తెరవాల్సిందే” అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఇక మాస్క్ లను తయారు చేసే పనిలో నిమగ్నమైన హనీవెల్ కార్మికులను, ఉద్యోగులను ట్రంప్ అభినందించారు. వారి కోసం తాను చీర్ లీడర్ గా మారతానని వ్యాఖ్యానించారు. అక్కడి ఉద్యోగులతో సమావేశమైన వేళ, అందరూ మాస్క్ లను ధరిస్తే, ట్రంప్ మాత్రం దానికి దూరంగా ఉండడం గమనార్హం.