telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు చంద్రబాబు, భవనేశ్వరిల పెళ్లి రోజు.. ట్విట్టర్ లో లోకేశ్ శుభాకాంక్షలు!

chandrababu buvaneshwari

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరిల పెళ్లి రోజు సందర్భంగా నేడు వారి కుమారుడు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేశారు.

“ఈరోజు అమ్మానాన్నల పెళ్ళిరోజు. సహధర్మచారిణి అన్న పదాన్ని నాన్నగారి జీవితంలో నిజం చేస్తూ ఆయన ఆశయాల్లో, ఆలోచనల్లో తోడుగా నిలుస్తానంటూ చేయిపట్టి అమ్మ ఏడడుగులు నడిచిన రోజు. ఆ ఆదర్శ దంపతులు సుఖసంతోషాలతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts