telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రవాస భారతీయుల ఓట్ల కోసమే ట్రంప్ పర్యటన: సీపీఐ నారాయణ

Narayana cpi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా ఆయన అభివర్ణించారు. అమెరికాలోని ప్రవాస భారతీయుల ఓట్ల కోసమే ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో జరుగుతున్న సీపీఐ రాష్ట్రస్థాయి నిర్మాణ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నేటి ట్రంప్ పర్యటనను అడ్డుకుంటామని తెలిపారు.

దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నారాయణ తెలిపారు. అమెరికాలోని భారతీయులను హింసిస్తున్న ట్రంప్‌కు మోదీ స్వాగతం పలకడం దారుణమన్నారు. భారత్‌కు మేలు చేస్తున్న ఇరాన్‌పై ట్రంప్ దాడులు చేస్తున్నారని, మెక్సికో సరిహద్దులో ట్రంప్ గోడ కడుతున్నట్టు మోదీ అహ్మదాబాద్‌లో కట్టారని ఎద్దేవా చేశారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి నేడు ఇచ్చే విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కావొద్దని నారాయణ డిమాండ్ చేశారు.

Related posts